ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్, ఉన్నతాధికారులతో కరోనా పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత 24 గంటల్లో 3,583 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడు నాలుగు వేవ్ నడుస్తుందని, అందువలనే కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రోజువారీ కేసులు పెరుగుతున్నప్పటికీ, గతంలో వచ్చిన కరోనా వేవ్స్ పరిస్థితితో పోలిస్తే తీవ్రత కొంత తక్కువుందని, మరణ రేటు కూడా తక్కువుగా నమోదవుతుందని తెలిపారు. అలాగే అన్ని వయసుల వారికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టేందుకు అనుమతిపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ పంపిణీకి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం అనుమతించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ