ఆస్పత్రిలో చేరిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్

Covid 19 for sachin, COVID 19 News, COVID-19, Cricket icon Sachin Tendulkar, Mango News, Master Blaster Sachin Tendulkar Tested Positive, Master Blaster Sachin Tendulkar Tested Positive for COVID-19, sachin tendulkar corona positive, sachin tendulkar corona positive news, Sachin Tendulkar Tested Positive, Sachin Tendulkar Tested Positive for COVID-19, Sachin Tendulkar tests positive, Sachin Tendulkar tests positive for Covid-19

దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మార్చి 27 వ తేదీన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన ఆరురోజుల అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు ట్విట్టర్ ద్వారా సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. “మీ ప్రేమ మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యుల సలహా ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నేను ఆసుపత్రిలో చేరాను. కొద్ది రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి మరియు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి. అలాగే వన్డే ప్రపంచకప్ సాధించి నేటితో 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారతీయులందరికీ మరియు నా సహచర ఆటగాళ్లందరికి శుభాకాంక్షలు” అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

ముందుగా కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఆస్పత్రిలో చేరారు. సచిన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here