ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కి జూన్ 17 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షిణించినట్టు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడంతో ఢిల్లీ లోని సాకేత్ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్‌తో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్లాస్మా థెరఫీ చేసే అవకాశమునట్టు సమాచారం. సత్యేందర్ జైన్ కరోనా బారిన పడటంతో ఆయన బాధ్యతలను ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అప్పగించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu






































