యూపీ: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన యోగి ఆదిత్యనాథ్.. 25న సీఎంగా ప్రమాణ స్వీకారం

UP Yogi Adityanath Resigns From The Legislative Council Ahead of Govt Formation, UP Yogi Adityanath Resigns From The Legislative Council, UP Yogi Adityanath Ahead of Govt Formation, Legislative Council, UP Yogi Adityanath, Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, Yogi Adityanath Chief Minister of Uttar Pradesh, Chief Minister of Uttar Pradesh Yogi Adityanath, UP CM Yogi Adityanath, Uttar Pradesh Chief Minister, CM Yogi Adityanath Govt Formation In UP, CM Yogi Adityanath Govt, Uttar Pradesh Govt, Mango News, Mango News Telugu,

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరో 3 రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి యోగి రాజీనామా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన గోరఖ్‌పూర్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. సీఎం పదవి చేపట్టడం కోసం అప్పుడు MP పదవికి రాజీనామా చేసారు. అనంతరం 8 సెప్టెంబర్ 2017 న శాసన మండలి ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచాడు. అతను MLC గా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేశాడు.

అయితే ఈసారి యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని బీజేపీ నిర్ణయించింది. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి యోగి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో యోగి ఘనవిజయం సాధించారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మార్చి 25, 2022న యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని మీకు తెలియజేద్దాం. యూపీ రాజకీయాల్లో 37 ఏళ్ల తర్వాత ఓ పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =