కరోనాతో ఒకేరోజు 121 మంది మృతి, మరో 4,454 పాజిటివ్ కేసులు నమోదు

delhi corona cases, delhi corona cases update, delhi coronavirus, delhi coronavirus cases, delhi coronavirus cases live update, Delhi Coronavirus Deaths, delhi coronavirus news, delhi coronavirus update today, Delhi Coronavirus Updates, Delhi New Positive Cases, Mango News Telugu

ఢిల్లీ నగరంలో మూడో దశ కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. కేంద్రప్రభుత్వం కూడా ఢిల్లీలో కరోనా పరిస్థితిపై దృష్టి సారించి, సమీక్షలు నిర్వహించి కరోనా నివారణకు ప్రత్యేక చర్చలు తీసుకునేలా అధికారులుకు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా, గత నాలుగురోజుల నుంచి వరుసగా 100 కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఇక సోమవారం నాడు కూడా కొత్తగా 4454 కరోనా కేసులు, 121 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,34,317 కు, మరణాల సంఖ్య 8,512 కి చేరింది. ఇక కొత్తగా కరోనా నుంచి కోలుకున్న 7,216 మందితో కలిపి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 4,88,476 కి చేరింది. ప్రస్తుతం 37,329 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నవంబర్ 23 నాటికీ ఢిల్లీలో 58,53,278 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ