అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

DGCA Extends International Passenger Flights Ban Till September 30th

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ సెప్టెంబర్ 31, 2021 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తునట్లుగా డీజీసీఏ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో విమాన సేవలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. అలాగే సమర్థ అధికారం ఆధారంగా ఎంపిక చేసిన కొన్ని రూట్లు/దేశాలకు విమాన సర్వీసులు కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here