తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం తమిళనాడు రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొద్దిమందినే అథితులుగా ఆహ్వానించారు. స్టాలిన్ తో పాటుగా పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
ముందుగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి 234 అసెంబ్లీ స్థానాలు గానూ, 156 స్థానాల్లో స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదేళ్ల తరవాత తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ అధికారం చేపట్టింది. దివంగత సీఎం కరుణానిధి వారసుడిగా వచ్చి ఎంతో కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టాలిన్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మరోవైపు స్టాలిన్ కేబినెట్‌లో 34 మందికి చోటు దక్కింది. గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితో పాటుగా యువకులు, కొత్త వారికి కూడా స్టాలిన్ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. దురైమురుగన్, చక్రపాణి, వి.సెంథిల్ బాలాజీ, ఆర్.గాంధీ, పళనివేల్ త్యాగరాజన్, ఎస్‌ఎం.నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, కెఎన్.నెహ్రూ, రఘుపతి, ముత్తుస్వామి, కె.రామచంద్రన్, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్, ఎం.సుబ్రమణియన్, పి.మూర్తి, ఎస్‌ఎస్ శివశంకర్, పెరయకుప్పన్, టీఎం.అన్బరసన్, ఐ.పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, పీకె.శేఖర్‌బాబు, అన్బిల్ మహేష్, పొయ్యామొళి లు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ