ఈ కాలిక్యులేటర్ మరణాన్ని కచ్చితంగా అంచనా వేస్తుందా?

Does This Calculator Predict Mortality Accurately, Predict Mortality Accurately, Calculator Predict Mortality, This Calculator Predict Mortality, Death Calculator,ChatGPT, AI, Technical University Of Denmark, Life2vec, What Is Death Calculator, Calculator Predict Mortality Accurately, Latest AI News, Latest ChatGPT News, Mango News, Mango News Telugu
Death Calculator,ChatGPT , AI ,Technical University of Denmark,Life2vec,What is Death Calculator? calculator predict mortality accurately?

ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సంచలనాలు కలలో కూడా ఊహించలేకపోతున్నాము. మనిషి కష్టంగా భావించే, ఎక్కువ సమయం తీసుకునే పనులు కూడా  చాలా ఈజీగా, అదే సమయంలో స్పీడుగా పూర్తి చేసేస్తోంది. తాజాగా ఏఐ మనిషి మరణాన్ని కూడా అంచనా వేసే స్థాయికి ఎదిగిపోయింది.

సాధారణంగా ఒక మనిషి చనిపోయే సమయాన్ని కచ్చితంగా అంచనా చేయడం అసాధ్యం.కానీ ఆ అసాధ్యాన్ని  డెత్ కాలిక్యులేటర్  అని పిలిచే కొత్త ఏఐ టూల్ సుసాధ్యం చేసేసింది. వివిధ కారణాల వల్ల  ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో ఈ టూల్  78 శాతం కచ్చితంగా అంచనా వేస్తోంది. అంటే ఫలానా వ్యక్తి ఎక్స్‌పైరీ డేట్ ..ఫలానా  సమయం అని ఈ ఏఐ టూల్ చెప్పేయగలుగుతోంది.

తాజాగా టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్  పరిశోధకులు ఈ డెత్ కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేశారు, వీరు లైఫ్2వెక్ అనే అల్గారిథమ్‌ను క్రియేట్ చేయడానికి చాట్‌జీపీటీ వెనుక ఉన్న టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ అల్గారిథమ్  మనిషి ఇన్‌కమ్, ఆక్యుపేషన్, లొకేషన్,ఫుడ్ హ్యాబిట్స్, హెల్త్ హిస్టరీ వంటి పూర్తి డేటాను కూడా విశ్లేషిస్తుంది. వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల వ్యవధిలో ఆ మనిషి ఎంత కాలం మనుగడ సాధించగలరనే వివరాలను అందిస్తుంది.

వ్యక్తుల గురించి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఈ ఏఐ టూల్ ఉపయోగించింది. అయితే తర్వాత పరిశోధనా బృందం ఏఐ మోడల్‌కు ఇప్పటికే చనిపోయిన వ్యక్తుల డేటాను  అది కూడా  ప్రతి వ్యక్తి గురించి విడివిడిగా స్పెసిఫిక్ డేటాను అందించింది. లైఫ్2వెక్ అల్గారిథమ్‌ పరిశోధనా బృందానికి తన డిజిటల్ టోకెన్లను ఇచ్చింది. అయితే 78% కచ్చితత్వంతో 2020 నాటికి ఎవరు మరణించారో ఏఐ మోడల్ విజయవంతంగా అంచనా వేయడంతో పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE