ఆ నాలుగు స్థానాలు జనసేనకే..?

Those Four Seats Belong To Jana Sena, Those Four Seats to Jana Sena, Four Seats Jana Sena, Jana Sena Belongs To Those Four, Janasena, TDP, Janasena TDP Alliance, AP Assembly Elections, Vizag, Assembly, AP Elections News, CM Jagan, Latest Political News,AP News, Mango News, Mango News Telugu
Janasena, TDP, Janasena-TDP Alliance, AP Assembly elections, Vizag

వైసీపీని ఢీ కొట్టేందుకు తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న విషయం తెలిసిందే. ఎలాగైనా సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశం కాకరేపుతోంది. చంద్రబాబు నాయుడు జనసేనకు ఎన్ని టికెట్లు కట్టబెడుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేనకు కేటాయించబోయే స్థానాలకు సంబంధించి ఓ లెక్క ప్రచారంలో ఉంది.

ఇటీవల పలుమార్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సమావేశమై సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించారు. అయితే ఇప్పటికే రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 28 స్థానాలను జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారట. త్వరలో దీనిపై క్లారిటీ రానుందట. అయితే ఒక నాలుగు స్థానాలను మాత్రం కచ్చితంగా జనసేనకే దక్కనున్నాయట. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నాలుగు స్థానాలు జనసేనకు ఇచ్చేందుకు ఇటు చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న ఎలమంచిలి, గాజువాక, పెందుర్తి, భీమునిపట్నం స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందట. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారట. అయితే పంచకర్ల ఇంటి పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులను.. సుందరపు ఇంటి పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆ స్థానాల నుంచి బరిలోకి దింపాలని జనసేనాని యోచిస్తున్నారట.

ఇటీవల జనసేనలో చేరిన సుందరపు సతీష్‌కు గాజువాక టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా గాజువాక టికెట్ ఇస్తామని జనసేన హామీ ఇచ్చాకే ఆయన పార్టీలో చేరారట. దీంతో గాజువాక టికెట్ సుందరపు సతీష్‌కు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అలాగే ఎలమంచిలి టికెట్ సుందరపు విజయ్ కుమార్‌కి జనసేన కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 2019లో జనసేనలో చేరిన విజయ్ కుమార్.. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఆయనవైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నారట.

అటు పెందుర్తి టికెట్‌ను జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుకు ఇవ్వనున్నారట. అలాగే పంచకర్ల సందీప్‌కు భీమునిపట్నం టికెట్ ఇవ్వనున్నారట. ఎలాగైనా తమకు టికెట్ దక్కుతుందని కాన్ఫిడెన్స్‌తో ఉన్న పంచకర్ల రమేష్ బాబు, పంచకర్ల సందీప్ ఇప్పటి నుంచే తమ తమ నియోజకవర్గాల్లో విస్త్రతంగా పర్యటిస్తున్నారట. ఇప్పటి నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =