డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ కు కరోనా పాజిటివ్‌

Donald Trump's Eldest son Donald Trump Jr has Tested Positive for Covid-19

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ లక్షకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు కీలక నేతలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అతనికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ అన్ని కరోనా నిబంధనలు పాటిస్తున్నారని అతని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వైట్ హౌస్ లో ఇప్పటికే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ సహా వారి కుమారుడు బారెన్‌ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ