అబుదాబి ఎయిర్‌పోర్టుపై డ్రోన్‌ దాడి – మృతుల్లో ఇద్దరు భారతీయులు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్‌ దాడులు చేయగా ముగ్గురు మరణించారు. ప్రధాన విమానాశ్రయంలో ఒక పేలుడు జరిగింది. మరో చోట మూడు అయిల్‌ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అబుదాబి విమానాశ్రయంలోని ఓ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలియజేశారు. దాడి తమ పనే అని హౌతీ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.

అలాగే, ఏడీఎన్‌ఓసీ సంస్థకు చెందిన చమురు నిల్వలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం ముసఫాలో.. మూడు ఇంధన ట్యాంకర్ ట్రక్కులు పేలిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్‌ దాడుల్లో ఇద్దరు భారతీయులు, ఓ పాకిస్తాన్‌ వ్యక్తి మృతి చెందినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఎయిర్‌పోర్టు దగ్గరలోని ఒక స్థానిక ఆస్పత్రికి తరలించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ