బీహార్ ఎన్నికలతో పాటే దేశంలో ఉపఎన్నికల నిర్వహణ

2020 Bihar Legislative Assembly election, Bihar Assembly election, Bihar Assembly Election 2020, Bihar Bypolls, Bihar Elections, Bihar Elections 2020, Bihar Elections and 65 Bypolls, Bihar Legislative Assembly election, ECI, Elections in Bihar

దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణ గురించి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సమావేశం జరిగింది. ప్రస్తుతం శాసనసభ/పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి 65 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో వివిధ రాష్ట్రాల రాష్ట్ర శాసనసభలలో 64 ఖాళీలు, పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక చోట ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు మరియు కరోనా మహమ్మారి వంటి ఇతర అవరోధాలతో సహా అనేక అంశాల దృష్ట్యా తమ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు/ఎన్నికల అధికారులు పంపిన నివేదికలు, సమాచారాన్ని ఎన్నికల కమిషన్ సమీక్షించింది.

బీహార్ రాష్ట్రంలో జనరల్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 29, 2020 తేదీ లోపు పూర్తి కావల్సిఉంది. మొత్తం 65 స్థానాలకు ఉప ఎన్నికలతో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకే సమయంలో నిర్వహించాలని ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. సి.ఏ.పి.ఎఫ్/ఇతర శాంతిభద్రతల అంశంతో పాటు సంబంధిత వస్తు రవాణా సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఉండే అవకాశం ఉండడంతో, ఈ ఎన్నికలను ఒకే సారి నిర్వహించాలని భావిస్తున్నారు. ఉప ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఎన్నికల కమీషన్ తగిన సమయంలోప్రకటించనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu