దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మరోసారి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రానుంది. ఈక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర పాలిత ప్రాంతమయిన జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. పదేళ్ల తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు గుర్తింపు లేని పార్టీలకు, రిజిస్టర్ అయిన పార్టీలకు ఎన్నికల గుర్తు కోసం ఎన్నికల సంఘం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
2014లో చివరిసారిగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో బీజేపీ, పీడీపీ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పీడీపీకి చెందిన ముఫ్తీ మహ్మద్ సయ్యద్ 2014లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులు ఆయన మరణించడంతో.. ముఫ్తీ కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకే బీజేపీ మద్ధతును ఉపసంహరించుకుంది. దీంతో 2018లో జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ను మార్చారు.
ఈక్రమంలో పదేళ్ల తర్వాత తిరిగి కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈక్రమంలో సెప్టెంబర్ 30లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY