ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హైవేపై కూలిన రక్షణ గోడ, దారిలో చిక్కుకుపోయిన 10 వేల మంది ప్రయాణికులు

Uttarakhand 10000 People Stranded on Yamunotri Highway as Safety Wall Collapses, 10000 People Stranded on Yamunotri Highway as Safety Wall Collapses, Uttarakhand 10000 People Stranded on Yamunotri Highway, Safety Wall Collapses, Yamunotri Highway, 10000 People Stranded on Yamunotri Highway, Yamunotri Highway News, Yamunotri Highway Latest News, Yamunotri Highway Latest Updates, Yamunotri Highway Live Updates, Uttarakhand, Over 10000 people are said to be stranded on the route going to the Yamunotri temple in Uttrakhand, Mango News, Mango News Telugu,

ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే హైవేపై 10,000 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారు. ఈ మేరకు హైవే యొక్క భద్రతా గోడ కూలిపోవడంతో రాకపోకలు సాగించే మార్గం మూసుకుపోయింది, మళ్లీ రహదారిని తెరవడానికి 3 రోజులు పట్టవచ్చని స్థానిక అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో 10,000 మందికి పైగా ప్రయాణికులు, యాత్రికులు హైవే వెంబడి వివిధ ప్రదేశాలలో చిక్కుకున్నట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఒక ట్రాక్టర్ ట్రాలీ, రెండు జెసిబి యంత్రాలు, ఒక టిప్పర్, ఒక పోక్‌ల్యాండ్ మరియు 15 మంది కూలీలను సంఘటనా స్థలానికి తరలించారు. అయితే భారీ కొండచరియలు పడటంతో సహాయక చర్యలు అనుకున్నంత వేగంగా జరగటం లేదని అధికారులు వివరించారు.

గురువారం అర్థరాత్రి రాణా చట్టి మరియు సయన చట్టి మధ్య యమునోత్రి హైవేపై ఒక్కసారిగా 15 మీటర్ల విస్తీర్ణంలో కొండచరియలు విరిగి పడటంతో బస్సులు మరియు ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. చిన్న వాహనాలు మాత్రమే బార్‌కోట్ నుండి జన్ కి చట్టి వరకు వెళ్లగలిగాయి. బస్సులు మరియు ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. దీంతో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో దాదాపు 24 బస్సులు, 15కు పైగా యాత్రికులు మినీ బస్సులు నిలిచిపోయాయని, వీటి కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిందని వెల్లడించారు. అయితే చిక్కుకుపోయిన యాత్రికులను సయన చట్టి చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు, అతిథి గృహాల్లోని సురక్షిత ఆశ్రయాలకు తరలించామని డీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా పూర్తిస్థాయి హైవే పునరుద్దరణకు మరో రెండు రోజుల సమయం పెట్టొచ్చని అధికారులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here