ఫేస్‌బుక్, ఇన్‌స్టాలు మీ పర్సనల్ డేటాను ఎక్కువగా తీసుకుంటాయంటూ ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన సర్వేలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్ ఫోన్లోని ప్రతి యాప్ మీ వ్యక్తిగత సమాచారాన్ని కొంత అడుగుతుంది. అవి తప్పనిసరిగా వాటిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అవి ఇవ్వకపోతే యాప్ ఇన్ స్టాల్ అవదు. ఒకవేళ ఇన్ స్టాల్ అయినా కూడా పూర్తి వివరాలు అందిస్తే కానీ దానితో పని చేయలేం. సోషల్ మీడియా యాప్ ల దగ్గర నుంచి ఆఫీస్ యాప్స్, కొన్ని టూల్స్, ఎడిటింగ్ యాప్స్ అన్నింట్లోనూ వినియోగదారుల డేటా ను అడుగుతుంది.
అయితే ఏ యాప్స్ లో చాలా తక్కువ సమాచారం అడుగుతుంది? ఏ యాప్ వినియోగదారులకు సంబంధించిన ఎక్కువ సమాచారం తమ యాప్ లలో నిక్షిప్తం చేస్తుందనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ యాప్స్ కూడా ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. దీంతోనే సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఓ సర్వే చేసింది. యాప్ లు స్వీకరించే డేటా విధానాలను అధ్యయనం చేసింది. దాదాపు 100 ప్రముఖ యాప్ లపై ఈ అధ్యయనం చేసి విడుదల చేసిన ఆ నివేదికలో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి.
మన వ్యక్తిగత సమాచారాన్నిఎక్కువగా తీసుకుంటున్న యాప్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉన్నాయట. ఈ రెండు యాప్స్ వినియోగదారుల డేటాను కూడా ఎక్కువగా తీసుకుంటుందని చెప్పింది. యాపిల్ ప్రైవసీ పాలసీలో పేర్కొన్న 32 డేటా పాయింట్లను ప్రాథమికంగా తీసుకొని సర్ఫ్‌షార్క్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ అధ్యయనం చేసింది. వాటిల్లో సెన్సిటివ్ విషయాలైన పేమెంట్ డీటైల్స్, బ్రౌజింగ్ హిస్టరీ, మీ కచ్చితమైన లొకేషన్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ఆధారంగా అధ్యయనం చేసి యాప్స్ కు ర్యాకింగ్ ఇచ్చింది.
మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ డేటా సేకరణ ఒకే విధంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. యాపిల్ ప్రైవసీ పాలసీలోని 32 డేటా పాయింట్ల బట్టి చూస్తే వాటన్నంటిని ఈ రెండు యాప్స్ ఎక్కువగా సేకరిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. మరే ఇతర యాప్లలో కూడా ఇన్ని విధాలుగా డేటా పాయింట్లలో సమాచార సేకరణ లేదని చెబుతున్నారు. దాదాపు 10 సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ లలో దాదాపు సగటు కంటే ఎక్కువ డేటాను సేకరిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY