ఆ కంపెనీ ఇల్లు కొంటే వైఫ్ ఫ్రీ

If That Company Buys A House Wife Is Free

సేల్స్ పెంచుకునేందుకు ఏ కంపెనీ అయినా డిస్కౌంట్ లు ఇస్తుంది.. ఉచిత బహుమతులు లేదా లక్కీ డ్రా అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కంపెనీ ఏకంగా తమ సంస్థలో ఇల్లు కొంటే భార్యను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం కొనసాగుతోంది. రెండేళ్లుగా అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది.

ఇల్లు, భూముల విక్రయాలు జరగక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఎన్నో మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలిపోయాయి. ఇదే సమయంలో పెరుగుతున్న ఖర్చులు, ఆదాయం తగ్గిపోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో పెళ్లి చేసుకోవడానికి చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవడం పట్ల ఆసక్తి చూపట్లేదు. వివాహాలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం కూడా చాలా ఆఫర్లు ప్రకటించినా పెద్దగా యువతలో స్పందన లేదు.

రియల్ భూమ్ పడిపోవడంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి వింత వింత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టియంజాన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టిన ఆఫర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తమ దగ్గర ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఆఫర్ చూసిన తర్వాత అయినా ఇళ్ల కొనుగోళ్లకు ఊపందుకుంటాయని కంపెనీ భావించింది. అయితే ఈ ప్రకటన చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కంపెనీపై 3 లక్షల జరిమానా విధించారు. అయితే చైనా కంపెనీ ఇచ్చిన ప్రకటనలో పెద్ద మెలిక ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది. ఒకే విధమైన చైనీస్ అక్షరాలను ఉపయోగించి, ఇంటి కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీ వస్తువులు అందించడానికి దీనిని ఆ కంపెనీ రూపొందించినట్లు ఆ కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

మరోవైపు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ కంపెనీ ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఉచితంగా ఇస్తామని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేసింది. రెండు సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే  దివాళా తీయడంతో ఆ దేశంలో రియల్ ఎస్టేట్ కష్టాలు మెుదలయ్యాయి. ఆ తర్వాత చాలా మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలాయి. దీంతో చైనాలో ఇళ్ల రేట్లు భారీగా పడిపోయాయి. చైనాలోని నాలుగు సంపన్న నగరాల్లో ప్రస్తుతం ఉన్న ఇళ్ల ధరలు 11% మరియు 14% మధ్య తగ్గాయి.  మరో రెండేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =