గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్‌లకు ఎమ్మెల్సీ పదవి

Prof. Kodandaram, Amarullah Khan, MLC, Governor's Quota, Congress, Revanth Reddy, MLC, CM Revanth, Telangana News Live,Telangana News, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana News, Telangana, Mango News Telugu, Mango News
Prof. Kodandaram, Amarullah Khan, MLC post, governor's quota, Congress, Revanth reddy

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి కట్టబెట్టింది. గవర్నర్ కోటాలో కోదండరామ్‌‌ శాసన మండలికి ఎన్నికయ్యారు. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలోనే ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌తో కలిసి పోరాటం చేశారు. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు బీఆర్ఎస్‌ విధానాలతో విభేదించారు. అప్పటి నుంచి బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 2018లో తెలంగాణ జనసమితి పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించారు. ప్రజలకోసం పోరాటాలు, ఉద్యమాలు చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లారు. కానీ అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు.

ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు కోదండరామ్ మద్ధతు తెలియజేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కోదండరామ్‌కి కీలక పదవిని ఇస్తామని అప్పట్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన సేవలను తమ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకుంటుందని అన్నారు. అప్పుడు మాట ఇచ్చినట్లుగానే కోదండరామ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం కొద్దిరోజుల క్రితమే వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రకటించింది. బల్మూరి వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌లను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హైకమాండ్ ఖరారు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =