ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ సరోజ్ ఖాన్ కన్నుమూత

Famous Bollywood Choreographer Saroj Khan Passes Away at 71

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ సరోజ్ ఖాన్ (71) జూలై 3, శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె జూన్ 27న బాంద్రాలోని గురునానక్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆమెకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు వెల్లడించారు. బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ బాలీవుడ్‌లో దిగ్గజ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. 50 ఏళ్ల సినీ కెరీర్ లో 2000 లకు పైగా పాటలకు కొరియోగ్రాఫర్‌ గా చేసి, ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సరోజ్ ఖాన్ మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో ‘చూడాలని ఉంది’ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఆమె, నంది అవార్డు కూడా దక్కించుకున్నారు. సరోజ్ ఖాన్ మరణం బాలీవుడ్‌ను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.