కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకుపైగా రైతులు ఉద్యమం కొనసాగిసున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు భారత్ బంద్, ట్రాక్టర్ల ర్యాలీ, చక్కా జామ్ వంటి కార్యక్రమాలు చేపట్టిన రైతులు సంఘాలు తాజాగా తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. మే నెల మొదటి 15 రోజులలోపల “పార్లమెంట్ మార్చ్” చేపట్టాలని నిర్ణయించినట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు ప్రకటించారు. పార్లమెంట్ మార్చ్ నిర్వహించే తేదీ ఇంకా నిర్ణయించబడలేదని, త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. పార్లమెంటు మార్చ్ లో రైతులే కాకుండా, మహిళలు, నిరుద్యోగులు మరియు ఉద్యమానికి సహకరిస్తున్న కార్మికులు కూడా పాల్గొంటారని చెప్పారు.
ఈ మార్చ్ ను శాంతియుత పద్ధతిలో నిర్వహిస్తామని, జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఏప్రిల్ 10న కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేను 24 గంటలు పాటుగా నిర్బంధించనున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ