పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం

Parliament Winter Sessions Cancelled due to Covid-19,Covid-19,No Winter Session Of Parliament Due To Coronavirus,No Winter Session This Year Due To Covid-19 Pandemic,No Winter Session Of Parliament Due To Covid-19,Winter Session Of Parliament,No Winter Session This Year Due To Corona Pandemic,Mango News,Mango News Telugu,Winter Session Of Parliament Gets Cancelled Due To Surge In Covid-19 Infections,Parliament Winter Session Cancelled,Parliament No Winter Session Due To Pandemic,Budget Session To Take Place In January,Winter Session,Coronavirus Crisis,Covid-19,Parliament,Budget Session,Winter Session Of Parliament Cancelled,Parliament Winter Sessions Cancelled,No winter session of Parliament,No Winter Session

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని కేంద్రప్రభుత్వం మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ముందుగా కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని, వెంటనే సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ లోక్‌సభ నేత అధిర్ రంజన్ చౌధరీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషికి లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో అధిర్ రంజన్ చౌధరీ లేఖకు బదులిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కరోనా వ్యాప్తి చెందకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయటానికి అంగీకరించాయని మరియు జనవరిలో నేరుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి ప్రల్హాద్ జోషి పేర్కొన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయని, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ శీతాకాలపు నెలలు ఎంతో కీలకమని మంత్రి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల రద్దుపై తమను సంప్రదించలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =