నేటి అర్ధరాత్రి నుంచి 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి, ఫాస్టాగ్ లేకుంటే రెండు రెట్లు ఫీజు

FASTag Declared Mandatory for All 4 Wheeler Vehicles From Today Midnight

ఫాస్టాగ్ ద్వారా జాతీయ రహదారులపై (నేషనల్ హైవే) టోల్ ఛార్జీలు వసూలు విధానం నేటి నుంచి తప్పనిసరి కానుంది. ఫిబ్రవరి 15, 2021 అర్ధరాత్రి నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తున్నట్లుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జాతీయ రహదారులపై ఫీజు ప్లాజాలలోని అన్నిదారులను ఫీజు ప్లాజా యొక్క ఫాస్టాగ్ దారులుగా మారుస్తునట్టు ప్రకటించారు. నేషనల్ హైవే ఫీజు నిబంధనలు-2008 ప్రకారం ఏదైనా నాలుగు చక్రాల వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ లేదా అసలు ఫాస్టాగ్ అమర్చబడి లేకుంటే, ఫీజు ప్లాజా వద్ద ఆ సందర్భంలో చెల్లించాల్సిన ఫీజుకు రెండు రెట్లు సమానమైన ఫీజును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

దేశంలో డిజిటల్ మోడ్ ద్వారా ఫీజు చెల్లింపును మరింత ప్రోత్సహించడానికి, ట్రాఫిక్ నియంత్రణ, నిరీక్షణ సమయం తగ్గించడానికి మరియు ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఈ ఫాస్టాగ్స్ తప్పనిసరి విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ముందుగా జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆ గడువును ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించారు. వాహన యజమానులంతా ఫాస్టాగ్ విధానానికి మారాలని, ఇకపై గడువు పొడిగించేది లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం అమల్లోకి రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ