మార్చ్ నెలలో ఢిల్లీలో తబ్లీగి జమాత్ సమావేశానికి హాజరైన 12 మంది బంగ్లాదేశ్ పౌరులపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఏప్రిల్ 4, శనివారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. విదేశీ చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో వీరిపై కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన వీరంతా ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలోని భసాని గ్రామంలో ఒక మసీదులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తానా భవన్ పోలీసులు వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించినట్టు చెప్పారు. 12 మందిలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలిందని, వారందరిపై 1946 విదేశీయుల చట్టం ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు తానా భవన్ పోలీసులు అధికారులు తెలిపారు. భసాని గ్రామంలోని ఈ 12 మందిని కనుగొన్న తరువాత వారికీ ఆశ్రయం కల్పించిన మరో ఇద్దరు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి, క్వారంటైన్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
[subscribe]