తమిళనాడు: జయలలిత మృతిపై ముగిసిన ఆర్ముగ స్వామి కమిషన్ విచారణ.. సీఎం స్టాలిన్‌కు 590 పేజీలతో కీలక నివేదిక

Tamil Nadu Retired Justice Arumughaswamy Commission Submits The Death Report of Jayalalithaa To CM Stalin, Justice Arumughaswamy Submits Report On Jayalalithaa's Death, Arumughaswamy Panel Submits Report To CM MK Stalin, Mango News, Mango News Telugu, Arumugasamy Commission, Justice Arumughaswamy Commission on Jayalalithaa's Death, Retired Justice Arumughaswamy, Jayalalithaa Death, Tamilnadu CM M K Stalin, Jayalalithaa Death Report Latest News And Updates, M K Stalin News And Live Updates, Jayalalithaa, Jayalalithaa's Death Report,

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్డ్‌ జస్టిస్‌ ఆర్ముగ స్వామి కమిషన్‌ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ మేరకు కమిషన్ శనివారం సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి కీలక నివేదికను సమర్పించింది. సుమారు 590 పేజీలతో కూడిన ఫైనల్ రిపోర్టును కమిషన్‌ తయారు చేసింది. కాగా ఈ కమిషన్‌ ఏర్పాటైన దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తుది నివేదికను సమర్పించచడం విశేషం. కాగా 2016 సెప్టెంబ‌ర్ 22వ తేదీన జయలతిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటూ డిసెంబ‌ర్ 5వ తేదీన ఆమె కన్నుమూశారు. అయితే ఆమె మరణంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.

దీంతో జయలలిత మరణం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబరులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్ముగ స్వామి క‌మిష‌న్ దాదాపు ఐదేళ్ల కాలంలో సుమారు రెండు వంద‌ల మందిని ప్ర‌శ్నించింది. విచార‌ణ‌లో భాగంగా.. జయలలిత సన్నిహితులు, బంధువులు, మాజీ మంత్రులను విచారించింది. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులను సైతం లోతుగా ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది. అనంతరం దీనిపై పూర్తి నివేదికను సిద్ధం చేసి ఈరోజు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేసింది. దీంతో ఈ నివేదికలో జయలలిత మృతిపై ఎలాంటి విషయాలు పొందుపర్చారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =