ఎన్సీపీ లో చేరిన బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే

BJP Leader Eknath Khadse, BJP Leader Eknath Khadse Joined in NCP, Eknath Khadse, Eknath Khadse Joined in NCP, Former Maharashtra BJP Leader Eknath Khadse, Former Maharashtra BJP Leader Eknath Khadse Joined in NCP, Maharashtra, Maharashtra BJP Leader Eknath Khadse Joined in NCP, Maharashtra Political News

మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత 40 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం మధ్యాహ్నం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) లో చేరారు. ఎన్సీపీ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఏక్‌నాథ్‌ ఖడ్సే కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఖడ్సేతో పాటుగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూడా ఎన్సీపీలో చేశారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్‌ ఖడ్సే మాట్లాడుతూ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పై విమర్శలు గుప్పించారు. తనపై పుకార్లు సృష్టించి తన జీవితాన్ని మరియు రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను ఏనాడూ బీజేపీని వీడతానని అనుకోలేదని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసి 2016 లో ఫడ్నవిస్ మంత్రి వర్గం నుండి ఏక్‌నాథ్‌ ఖడ్సే తప్పుకున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu