ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్‌ను నియమించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పీకే మిశ్రా ప్రధాని మోదీకి ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ప్రధానమంత్రి పదవీ కాలంతో సమానంగా లేదా కేంద్రం తీసుకునే తదుపరి నిర్ణయం వరకు కొనసాగనుంది.
శక్తికాంత దాస్ 2018 నుండి 2023 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్థిక, రెవెన్యూ, మినరల్స్, జీ20, ప్రపంచ బ్యాంక్ వ్యవహారాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాలతో కీలక పరిపాలనా మార్పులు చోటు చేసుకున్నాయి.
Former RBI Governor Shaktikanta Das, appointed as Principal Secretary-2 to Prime Minister Narendra Modi. pic.twitter.com/uUWt7SfLjj
— ANI (@ANI) February 22, 2025