యూజీసీ నూత‌న ఛైర్మ‌న్‌ గా మామిడాల జగదీష్ కుమార్ నియామకం

Centre Appoints JNU Vice-Chancellor, Centre Appoints JNU Vice-Chancellor M Jagadesh Kumar as New UGC Chairman, JNU VC Prof. Jagadesh Kumar appointed as new UGC chairman, JNU Vice Chancellor Jagadesh Kumar appointed the new UGC Chairman, JNU vice-chancellor Jagadesh Kumar, JNU Vice-Chancellor Jagadesh Kumar Appointed UGC, JNU Vice-Chancellor Jagadesh Kumar Appointed UGC Chairman, JNU vice-chancellor Jagadesh Kumar named new UGC, JNU Vice-Chancellor M Jagadesh Kumar, M Jagadesh Kumar, M Jagadesh Kumar as New UGC Chairman, Mango News, new UGC

యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ)కు నూత‌న ఛైర్మ‌న్‌ గా మామిడాల జగదీష్ కుమార్ ను నియ‌మించబడ్డారు. తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ గా ఉన్నారు. యూజీసీ ఛైర్మ‌న్‌ గా ఉన్న డిపి సింగ్ రాజీనామా అనంతరం, గత డిసెంబర్ 7 నుంచి ఆ పదవీ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జగదీష్ కుమార్ ను యూజీసీ ఛైర్మన్ గా నియ‌మిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ పదవీలో ఆయన ఐదేళ్ల పాటుగా కొనసాగనున్నారు.

జగదీష్ కుమార్ ప్రస్తుతం జేఎన్‌యూ వైస్-ఛాన్సలర్‌ గానే కాకుండా ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలాగే గతంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఐఐటీ ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి ఏంఎస్ మరియు పీహెఛ్డీ పట్టాలను పొందారు. మరోవైపు యూజీసీ ఛైర్మ‌న్‌ గా నియమించబడ్డ మూడో తెలుగు వ్యక్తిగా జగదీష్ కుమార్ నిలిచారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =