దేశంలో ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కరోనా వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను ప్రజలకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య అంతరం/గ్యాప్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ మొదటి డోసు తీసుకున్న రోజు నుంచి 6-8 వారాల అంతరంలో రెండో డోస్ అందిస్తున్నారు. అయితే కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని12-16 వారాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ ఎన్ కె అరోరా ఆధ్వర్యంలోని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పొడిగించాలని సిఫారసు చేసిందని పేర్కొన్నారు. రియల్ లైఫ్ సాక్ష్యాల ఆధారంగా, ముఖ్యంగా యూకే సమాచారం ఆధారంగా రెండు డోసుల మధ్య అంతరాన్ని 12-16 వారాలకు పెంచడానికి కోవిడ్ వర్కింగ్ గ్రూప్ అంగీకరించిందని చెప్పారు. అయితే కోవాక్సిన్ కరోనా వ్యాక్సిన్ డోసుల అంతరంలో మాత్రం ఎలాంటి సిఫార్సు చేయబడలేదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ