సూపర్ జెయింట్స్ ఫ్యామిలీ ‘గ్లోబల్ మెంటార్’ గా గౌతమ్ గంభీర్ నియామకం

Gautam Gambhir Appointed as the Global Mentor for All Supergiants Teams, Gautam Gambhir Appointed as Global Mentor , Global Mentor For Super Giants Family, Gautam Gambhir Mentor For Super Giants Family, Super Giants Family, Mango News, Mango News Telugu, Super Giants Appoint Gautam Gambhir, Gautam Gambhir Latest News And Updates, Super Giants News And Live Updates, Gautam Gambhir Fixed Global Mentor, Gambhir Named Global Mentor Of Super Giant, Lucknow Super Giants, Lucknow Super Giants IPL, IPL TEam , IPL News And Latest Updates

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో సూపర్ జెయింట్స్‌ ప్రాంఛైజీని దక్కించుకుంది. తోలి సీజన్ లో ఈ జట్టుకు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మెంటార్ గా వ్యవహరించి, ప్లే ఆప్స్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా గౌతమ్ గంభీర్ కు ప్రమోషన్ లభించింది. గౌతమ్ గంభీర్‌ను ఆర్పీఎస్జీ గ్రూప్ యొక్క సూపర్ జెయింట్స్ ఫ్యామిలీ ‘గ్లోబల్ మెంటార్’ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్‌ తో పాటుగా సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో పాల్గొనే డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి కూడా గంభీర్ మెంటార్ గా సేవలు అందించనున్నాడు.

ఈ నియామకంపై గంభీర్ స్పందిస్తూ, “నా భావజాలం ప్రకారం జట్టుకు సంబంధించి హోదాలు పెద్దగా పాత్ర పోషించవు. అత్యుత్తమంగా, జట్టును గెలిపించే ప్రక్రియను సులభతరం చేయడానికి వారు ఉన్నారు. సూపర్ జెయింట్స్ యొక్క గ్లోబల్ మెంటార్‌గా నేను కొంత అదనపు బాధ్యత కోసం ఎదురు చూస్తున్నాను. గెలవాలనే నా తీవ్రత మరియు అభిరుచికి ఇప్పుడే అంతర్జాతీయ రెక్కలు వచ్చాయి. సూపర్ జెయింట్స్ ఫ్యామిలీ ప్రపంచవ్యాప్త ముద్ర వేయడం గర్వకారణం. నాపై ఆ నమ్మకాన్ని చూపినందుకు సూపర్ జెయింట్స్ ఫ్యామిలీకి ధన్యవాదాలు. ఇంకొన్ని నిద్రలేని రాత్రులకు ఇది సమయం అని అనుకోండి” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY