రాజస్థాన్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ లో సంక్షోభం, 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా?

Rajasthan Congress Crisis: 92 MLAs Close to Ashok Gehlot Submit their Resignation to Assembly Speaker, Crisis In The Ruling Congress In Rajasthan State, 92 MLAs Resigned In Rajasthan Congress, Operation Desert Storm, 82 Rajasthan MLAs Resigned, Rajasthan Political Crisis, Rajasthan Congress Crisis, Crisis In Rajasthan Congress, Mango News, Mango News Telugu, Rajasthan Congress Crisis Updates, Ashok Gehlot MLAs Quit Congress, Rajasthan Political Crisis Live News And Updates, Rajasthan Political Crisis Live News, Ashok Gehlot Rajasthan CM, Rajasthan Congress Crisis

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకుంది. ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎంపిక సందర్భంగా రాజస్థాన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తదుపరి రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్​ను ఎంపిక చేయకూడడని అశోక్ గహ్లోత్ మద్దతుదారులు తమ డిమాండ్ ను పార్టీ హైకమాండ్ ముందు ఉంచారు. ఆదివారం సాయంత్రం సీఎం నివాసంలో పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి విముఖత చూపుతూ అశోక్ గెహ్లాట్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం అర్థరాత్రి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి రాజీనామా లేఖలను సమర్పించారు.

రాజస్థాన్‌లో సీఎం పదవిని సచిన్ పైలట్‌కు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపడంతో, గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ఆదివారం మధ్యాహ్నం నుంచే తమ వ్యతిరేకతను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. తమను సంప్రదించకుండా సీఎంను ఎన్నుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చర్యలు తీసుకోనున్నట్లు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులుగా మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్​ లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను చర్చలకు రావాలని అజయ్ మాకెన్ అభ్యర్ధించారు.

ఈ క్రమంలో గెహ్లాట్ వర్గం మూడు షరతులను తమ ముందు ఉంచిందని అజయ్ మాకెన్ సోమవారం ఉదయం ప్రకటించారు. సీఎం ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి వదిలివేయాలనే తీర్మానాన్ని ఆమోదించాలని, అయితే అక్టోబర్ 19 తర్వాత సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు షరతు పెట్టారన్నారు. అలాగే చర్చలకు విడివిడిగా రామని, ఒక బృందం గానే అందరం వస్తామని చెప్పారన్నారు. ఇక అశోక్ గెహ్లాట్‌ వర్గమైన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని మాత్రమే తదుపరి సీఎం చేయాలని, సచిన్ పైలట్ లేదా అతని గ్రూపులోని ఎవరిని సీఎం చేయకూడదని డిమాండ్ చేశారని అజయ్ మాకెన్ తెలిపారు. కాగా కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షరతులతో కూడిన తీర్మానం ఆమోదించబడలేదని, పూర్తి నివేదికను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేస్తామని అజయ్ మాకెన్ చెప్పారు. ఎమ్మెల్యేల డిమాండ్స్ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుంది, రాజస్థాన్ రాజకీయ సంక్షోభం ఏ దిశగా వెళ్లనుంది అనే దానిపై వేచి చూడాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − one =