చైనాలో HMPV కలకలం: భారత ముందస్తు జాగ్రత్తలు..!

HMPV Surge In China Indias Vigilance And Global Health Concerns, Global Health Concerns, HMPV Surge In China, HMPV Surge In China Indias Vigilance, Indias Vigilance, China Health Crisis, Global Health Concerns, HMPV Virus, India Health Vigilance, Respiratory Virus Surge, Health, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

చైనాలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV) కేసులు భారీగా పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ప్రస్తుతం భారతదేశానికి ఆందోళన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేశారు.

HMPV వైరస్ లక్షణాలు:
HMPV ఒక రకమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా పిల్లలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి త్వరగా వ్యాపించగల సామర్థ్యం కలిగిన వైరస్. అయితే, ఇది కరోనా వైరస్ అంత ప్రమాదకరమని చైనా అధికారులు చెబుతున్నారు.

ఇండియాలో పరిస్థితి
ప్రస్తుతానికి భారత్‌లో HMPV వైరస్‌ కేసులు నమోదు కాలేదని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే పలు ప్రాంతాల్లో RSV, HMPV పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏదైనా ప్రమాదం తలెత్తినా దాన్ని ఎదుర్కొనేందుకు సర్వతా సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది.

తెలంగాణలో జాగ్రత్తలు:
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. HMPV కేసులు తెలంగాణలో ఎక్కడా లేవని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్ ప్రకటించారు. ప్రజలందరూ జలుబు, దగ్గు వంటి ఫ్లూ లక్షణాలు ఉన్నపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

చైనాలో తీవ్ర పరిణామాలు
చైనాలోని ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర చైనా ప్రావిన్సుల్లో HMPV వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. పేషెంట్లలో 14 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా ఉన్నారు. చలికాలం కారణంగా ఇన్‌ఫ్లూయెంజా, RSV, HMPV వంటి వైరస్‌లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, చైనా ప్రభుత్వం HMPV కు వ్యాక్సిన్ అందుబాటులో లేదని పేర్కొంది.

సామాన్య ఫ్లూ లక్షణాలతో ప్రారంభమైనా, పరిస్థితి తీవ్రమైతే నిమోనియా లాంటి తీవ్రమైన సమస్యలుగా మారే అవకాశం ఉంది. ప్రజలు మాస్కులు ధరించడం, స్క్రీనింగ్, ఐసోలేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నారు.

జాగ్రత్తలు ముందస్తు చర్యలు
దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించాలి. మాస్కులు ధరించడం, గుంపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చేతులు సబ్బుతో తరచూ శుభ్రం చేసుకోవాలి.
బలమైన ఇమ్యూనిటీ కోసం సరైన ఆహార పద్ధతులు పాటించాలి.