కొన్నాళ్ల వరకూ ఓయో రూమ్ వైపు చూడాలనుకున్నా భయపడే వాళ్లు కూడా ఇప్పుడు వాటిని ప్రైవసీ స్పేస్ అన్నట్లుగా భావిస్తున్నారు. బయట నుంచి వచ్చేవాళ్లు కూడా హోటల్‌లో దిగడానికి బదులు కాస్త ధరలు అందుబాటులో ఉండటంతో ఓయో రూముల వైపు తొంగి చూస్తున్నారు. దీంతో గల్లీగల్లీకో ఓయో బోర్డు కనిపించేంతగా విస్తరించాయి.
దీనికి తోడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ఎక్కడైనా,ఎక్కడ నుంచి అయినా బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో.. యూత్ ఫేవరేట్ అయిపోయాయి. కాకపోతే కొంతమంది యువతీయువకులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఓయో సంస్థ .. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఓయో రూమ్స్ బుకింగ్స్ విషయంలో హైదరాబాదీలు అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది.
ట్రావెలోపీడియా-2023 పేరుతో ఓయో సంస్థ దీనిపై ఓ రిపోర్ట్‌ను కూడా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతాలలో ఓయో రూములను బుక్ చేసుకున్నారో వివరాలను ప్రకటించింది. దీనిలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు హైదరాబాదీలు ఎక్కువగా రూములను బుక్ చేసుకోని అగ్రస్థానంలో నిలిచినట్లు సంస్థ తెలిపింది. అలాగే చిన్న పట్టణాల విభాగంలో కూడా తెలంగాణ రాష్ట్రమే టాప్‌లో నిలిచింది. అంటే తెలంగాణలోని వరంగల్ సిటీలో ఎక్కువ బుకింగ్స్ నమోదైనట్లు సంస్థ పేర్కొంది.
ఇక ఓయో రూమ్స్ బుకింగ్ విషయంలో హైదరాబాద్ మొదటి ప్లేసులో నిలవగా.. ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. అలాగే చిన్న నగరాల్లో వరంగల్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత యూపీలోని గోరఖ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, ఏపీలో గుంటూరు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజలు ఎక్కువగా ఓయో రూములను బుక్ చేసుకున్న ప్రాంతాల్లో జయపుర అగ్రస్థానంలో ఉన్నది. గోవా, మైసూర్, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆథ్మాత్మిక ప్రాంతాలయిన పూరీ, అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్, దేశ్‌ఘర్, పళని, గోవర్ధన్ నగరాలను ప్రజలు ఎక్కువగా సందర్శించారు.
అంతేకాకుండా ఒకే రోజు ఓయో రూమ్స్‌ను ఎక్కువ బుకింగ్స్ చేసుకున్న తేదీగా సెప్టెంబర్ 30 నమోదు అయింది. ఆ తర్వాత మే నెల నిలిచింది.అలాగే ఓయో రూమ్స్ కాకుండా హోటల్ రూములను ఎక్కువగా బుక్ చేసుకున్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ఫస్ట్ ప్లేసులో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE