రాహుల్ గాంధీపై మరో కేసు.. ఈ సారి జైలుకెళ్లడం తప్పదా..?

Another Case Against Rahul Gandhi This Time He Must Go To Jail, Another Case Against Rahul Gandhi, Case Against Rahul Gandhi, Rahul Gandhi Case, Rahul Gandhi Another Case, Rahul Gandhi, Case On Rahul Gandhi, Delhi High Court, Latest Rahul Gandhi Case, New Case On Rahul Gandhi, Another New Case On Rahul Gandhi, Latest High Court News, Latest High Court Updates, Political News, Mango News, Mango News Telugu
Rahul gandhi, Case on Rahul gandhi, Delhi High court,

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని చిక్కులు వెంటాడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆయన వరుస కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరోసారి రాహుల్ గాంధీకి జైలు శిక్ష తప్పేలా లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇటీవల మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గానూ.. గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ కేసులో బెయిల్ వచ్చిన కొద్దిరోజులకే.. అదే తరహాలో మరో కేసు రాహుల్ గాంధీపై నమోదు అయింది. ప్రధాని మోడీపై మరోసారి రాహుల్ గాంధీ కామెంట్లు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌లోని జలోర్‌లో నవంబర్ 22న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షా, గౌతమ్ అదానీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ముగ్గురూ జేబు దొంగలని వ్యాఖ్యానించారు. అంతకంటే ముందు మిజోరాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో కూడా మోడీపై సంచనల కామెంట్లు చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అయితే మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ.. స్టేడియంలోకి దశ్శకునం వచ్చిందని.. అందుకే టీమిండియా ఫైనల్‌లో ఓడిపోయిందని విమర్శించారు. అలాగే పిక్ పాకెట్ అని కూడా అన్నారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. ఈ ఘటనను ఢిల్లీ హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఆ పిటిషన్‌పై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్ణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. తన స్థాయిని మరిచి ఇలా వ్యాఖ్యానించడం సబబు కాదని కోర్టు పేర్కొంది.

ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. అయితే  ఈ పరిణామాలతో రాహుల్ గాంధీకి మరోసారి జైలు తప్పేలా లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 19 =