దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,84,376కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (25), కర్ణాటక (21), మహారాష్ట్ర (14), తెలంగాణ (7), వెస్ట్ బెంగాల్ (6) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 94 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,51,797 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన మరో మూడు మరణాలు (ఉత్తర్ ప్రదేశ్ లో 2, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,756కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 1,823కు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఫిబ్రవరి 15, బుధవారం ఉదయం 8 గంటల వరకు 220.63 కోట్లకుపైగా (2,20,63,11,547) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE