కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్, స్వామివారికి ప్రత్యేక పూజలు

CM KCR Visits Kondagattu Anjanna Temple and Offers Special Pujas For Lord Hanuman,Rythu Bandhu will Deposit,CM KCR 100 Cr for Kondagattu Anjanna Temple,Kondagattu Anjanna Temple Devolepment,Kondagattu Anjanna Temple,Rythu Bandhu,Telangana Rythu Bandhu,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. తొలుత ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న సీఎం కేసీఆర్‌, అక్కడినుంచి రోడ్డు మార్గంలో క్షేత్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ తదితరులు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఇక ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్‌కు వేదాశీర్వచనం ఇచ్చి దీవించగా.. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో కలిసి కొండగట్టుపై కలియతిరిగారు. ఈ క్రమంలో కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.

అనంతరం ఆలయ అభివృద్ధిపై జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సమాలోచనలు చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా సీఎం కేసీఆర్ ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి పలుమార్లు కొండగట్టును సందర్శించి, ఆలయ అభివృద్ధి నమూనాను రూపొందించినట్టుగా తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =