దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,738 కరోనా కేసులు, 138 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,46,914 కు, మరణాల సంఖ్య 1,56,705 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్ మరియు ఆసుపత్రుల్లో 1,51,708 (1.37%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 11,799 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,07,38,501 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.21 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.42 శాతంగా ఉంది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం 7 రాష్ట్రాలలోనే:
ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 89.57 శాతం మహారాష్ట్ర(8807), కేరళ (4106), పంజాబ్ (558), తమిళనాడు (463), గుజరాత్ (380), మధ్యప్రదేశ్ (344), కర్ణాటక (334) వంటి 7 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక ఫిబ్రవరి 24, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా 21,38,29,658 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,93,383 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ