సోషల్ మీడియా, ఓటీటీలు, డిజిటల్‌ న్యూస్ నియంత్రణపై కేంద్రం కొత్త నిబంధనలు

Centre Announces New Rules to Regulate OTTs, Centre Announces New Rules to Regulate Social Media, Centre releases new rules to regulate content on OTT, Centre to release OTT platform guidelines, Digital News, Government unveils new rules to regulate digital news, Govt announces new rules to OTT, Govt Announces Rules to Regulate Social Media, Govt Sets New Rules For OTT Platforms, Mango News, New Rules to Regulate Social Media, New social media and OTT rules, OTT, OTT Platforms India, OTTs and Digital News, Social Media New guidelines

దేశంలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్, డిజిటల్‌ న్యూస్‌ మీడియాపై నియంత్రణకు సంబంధించి కేంద్రప్రభుత్వం గురువారం నాడు కొత్త నిబంధనలను ప్రకటించింది. డిజిటల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల గురించి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021 సెక్షన్ కింద కొన్ని కొత్త నిబంధనలను వినియోగంలోకి తీసుకొస్తునట్టు పేర్కొన్నారు. వీటి వివరాలను కేంద్రమంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియా, ఓటీటీ నియంత్రణకు మూడు అంచల విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.

కొన్ని నియంత్రణ నిబంధనలు:

  • ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ కు సంబంధించి కంటెంట్ ‌ను ఐదు వయస్సు ఆధారిత వర్గాలుగా విభజన.
  • U (యూనివర్సల్), U/A 7+, U/A 13+, U/A 16+, మరియు A (పెద్దలు) గా విభజించాలి.
  • U/A 13+ లేదా అంతకంటే ఎక్కువ వర్గీకరించబడిన కంటెంట్ చూడాలంటే ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్ పేరెంట్ లాక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచాలి.
  • ఓటీటీలో ప్రతి కంటెంట్ లేదా ప్రోగ్రామ్‌కు ప్రత్యేకమైన వర్గీకరణ రేటింగ్‌ను, కంటెంట్ స్వభావాన్ని వినియోగదారుకు తెలియజేయాలి.
  • జాతీయ సమగ్రత దెబ్బతీసే కంటెంట్ పై నిషేధం కొనసాగింపు.
  • ఓటీటీతో పాటు డిజిట‌ల్ న్యూస్ మీడియా సంస్థ‌లు త‌మ వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది.
  •  సంస్థ‌ల రిజిస్ట్రేష‌న్లు త‌ప్ప‌నిస‌రి కాదు, కానీ సంబంధిత సంస్థల స‌మాచార సేకరణ జరుగనుంది.
  • ఓటీటీల‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వీయ నియంత్రణ సంస్థలు ఉండవచ్చు. అటువంటి సంస్థకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి లేదా స్వతంత్ర ప్రముఖ వ్యక్తి నేతృత్వం వహించాలి. అయితే ఆరుగురికి మించకూడదు.
  • అలాంటి సంస్థ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవాలి. ఈ స్వీయ నియంత్రణ సంస్థ ఓటీటీ నీతి నియమావళికి కట్టుబడి ఉండడాన్ని పర్యవేక్షిస్తుంది. అలాగే 15 రోజుల్లో ఓటీటీలు పరిష్కరించని సమస్యలను పరిష్కరిస్తుంది.
  • సోషల్ మీడియాలో వినియోగదారులు లేదా బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్ నియామకం. గ్రీవియ‌న్స్ ఆఫీస‌ర్ ఇరవై నాలుగు గంటలలోపు ఫిర్యాదును గుర్తించి, రసీదు అందజేసినప్పటినుంచి పదిహేను రోజుల్లో పరిష్కరించాలి.
  • మహిళలకు అసభ్యకర, అభ్యంతరకరమైన పోస్టులను గుర్తించిన తర్వాత 24 గంటల్లో తొలగించాలి.
  • తమ డిజిటల్ కార్యకలాపాలు చట్టం మరియు నిబంధనలకు లోబడి ఉండేలా చర్యలు తీసుకునేందుకు దేశానికి చెందిన చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ ను నియమించుకోవాలి.
  • అలాగే చట్టం అమలు చేసే సంస్థలతో 24×7 సమన్వయం కోసం దేశానికి చెందిన నోడల్ కాంటాక్ట్ వ్యక్తిని నియమించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =