దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 33,750 కరోనా పాజిటివ్ కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 3, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,49,22,882 కు, మరణాల సంఖ్య 4,81,893 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 3.84 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది.
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 10,846 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,42,95,407 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 98.20 శాతం గానూ, మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 1,45,582 (0.42) మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1700కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 510, ఢిల్లీలో 351, కేరళలో 156, గుజరాత్ లో 136, తమిళనాడులో 121, రాజస్థాన్ లో 120, తెలంగాణలో 84, కర్ణాటకలో 64, హర్యానాలో 63, ఒడిశాలో 37, వెస్ట్ బెంగాల్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 17, మధ్యప్రదేశ్ లో 9, ఉత్తర్ ప్రదేశ్ లో 8, ఉత్తరాఖండ్ లో 8, చండీఘర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 3 చొప్పున, అండమాన్ అండ్ నికోబార్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, పంజాబ్ లలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా మొత్తం 1700 బాధితుల్లో ఇప్పటికే 639 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ