కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయండి – చిరంజీవి

Plasma Yodhas Felicitated by Megastar Chiranjeevi , Cyberabad CP VC Sajjanar,CP VC Sajjanar,Plasma Yodhas,Megastar Chiranjeevi, Plasma Yodhas felicitated by Cyberabad Police,Megastar ,Chiranjeevi ,PlasmaYoddha,Cyberabad Police felicitates plasma donors

కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిని ప్లాస్మా దానం చేసేలా ప్రోత్సహిస్తూ సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ప్ర‌త్యేక సెల్‌ను ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 7, శుక్రవారం నాడు గచ్చిబౌలి లోని సైబ‌రాబాద్ కమిష‌న‌రేట్‌లో ప్లాస్మాదానం చేసిన పలువురిని సత్కరించే కార్యక్రమాన్ని సీపీ సజ్జనార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా‌ హాజరయ్యి ప్లాస్మాదాత‌ల‌ను స‌త్క‌రించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అసలైన ఆయుధం ప్లాస్మా. ప్లాస్మా దానం కరోనా బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తుంది. కరోనాతో తీవ్రంగా బాధపడే బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే అవకాశముందని చెప్పారు. ఒకరు దానం చేసిన ప్లాస్మా ద్వారా 30 మందికి కూడా సాయం చేయొచ్చని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని ఆయన కోరారు. కరోనా పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, లాక్‌డౌన్‌ సమయం నుండి ప్లాస్మా దానం వరకు సైబరాబాద్ పోలీసులు చేస్తున్నసేవను అందరూ గుర్తించుకోవాలని చెప్పారు. ప్ర‌మాదాల్లో ఎంతో మంది రక్తం దొరకక‌ మృతి చెందుతుండడం గమనించి సామాజిక బాధ్యతతో బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించానని చిరంజీవి అన్నారు. ఈ మధ్య చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ఉత్తమ బ్లడ్ బ్యాంక్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, అభిమానులను కూడా ఇటువంటి మంచి పనుల వైపు మళ్లిస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండి, నిబంధనలు పాటిస్తే వందశాతం కరోనాను ఎదుర్కొవచ్చని చిరంజీవి పేర్కొన్నారు.

సీపీ స‌జ్జ‌నార్ మాట్లాడుతూ, గతంలో తలసేమియా బాధితుల కోసం సైబరాబాద్ పోలీసులు తలపెట్టిన బ్లడ్ డోనేషన్ క్యాంప్‌లో త‌మ‌తో కలిసి చిరంజీవి పని చేశార‌ని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఎలాంటి సందేహాలు, అపోహలు లేకుండా ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేస్తే మళ్ళీ కరోనా వస్తుందనేది అస‌త్య ప్రచారమని, ప్లాస్మా దానానికి ముందుకొస్తే‌ మరో కుటుంబాన్ని కాపాడిన వారవుతార‌ని అన్నారు. ఇప్పటి వరకు 400 మందికి ప్లాస్మా అందించి వారి జీవితాలను కాపాడగలిగామని, ప్లాస్మా దాతలను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =