భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 94,371 పాజిటివ్ కేసులు నమోదవగా, 1,114 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 13, ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 47,54,357 కు, మరణాల సంఖ్య 78,586 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో గత కొన్ని రోజులుగా రోజుకి 1000 కి పైగా కరోనా మరణాలు నమోదవడం ఆందోళనగా మారింది. దేశంలో మరణాల రేటు 1.65 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మరోవైపు ఒకే రోజులో 78,399 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 37,02,595 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 77.88 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 9,73,175 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu