దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మొత్తం 1,36,102 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 93 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.07 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,82,530 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530739 గా ఉంది. కొత్తగా 147 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,49,949కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 1,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ(38), కర్ణాటక (30), తమిళనాడు (6), పశ్చిమబెంగాల్ (4), ఒడిశా (4) వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 40కి పైన కరోనా కేసులు నమోదవలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE