కొంతమందికి కుక్కలు పేరెత్తినే బాబోయ్ అంటారు. కొంతమందికి అస్సలు పడదు.. వాటిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడతారు. కానీ చాలామందికి కుక్కలంటే ప్రాణం పెడతారు. నిజానికి ప్రపంచంలో మనుష్యులకు, కుక్కలకు మధ్య సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
కుక్కలంటేనే విశ్వాసానికి మారు పేరుగా చెప్పుకుంటారు. అందుకే ఓ మనిషిని పెంచుకుని.. తర్వాత మనసుకు గాయం అయిందని బాధ పడటం కంటే.. కుక్కలను పెంచుకుంటాం అనేవాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటారు. చివరకు వీధి కుక్కలు కనిపించినా వాటికి ఆప్యాయంగా ఫుడ్ తినిపించి కానీ వెళ్లరు. అయితే ఇప్పుడు అదే వీధికుక్కల గురించి వెలుగులోకి వచ్చిన ఓ విషయం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. వీధి కుక్కల విషయం గురించి విని కొందరు ఆశ్చర్యపోతుండగా.. మరి కొందరు మాత్రం ప్రశంసిస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ముంబై లోని వీధి కుక్కలు గుర్తింపు కార్డులతో తిరుగుతూ కనిపించడంతో నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏంటా స్టోరీ అని ఆరా తీస్తే.. అక్కడ కొన్ని కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చారని తెలిసింది. దీంతో అదేంటి కుక్కలకు గుర్తింపు కార్డులా అని షాక్ అవుతున్నారట ముంబైవాసులు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బీఎంసీ.. 20 వీధికుక్కలను గుర్తించి.. వాటికి గుర్తింపు కార్డులను తయారు చేసి మరీ వాటి మెడలకు వేసింది. అంతే కాకుండా ప్రజలకు వీటి ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా.. ఆ కుక్కలకు ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ 1 దగ్గర టీకాలు కూడా వేశారట.
అంతేకాకుండా కుక్కుల మెడకు వేసిన గుర్తింపుకార్డులో ఓ స్కానర్‌ను కూడా అమర్చారట. ఆ స్కానర్లో ఆ కుక్కకు సంబంధించిన అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. అంటే కుక్క మెడలో ఉన్న గుర్తింపు కార్డులో ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు.. ఆ కుక్క పేరు, దానికి టీకాలు వేసారా లేదా.. ఎప్పుడు వేస్తారనేది తెలిసిపోతుంది. దీనితో పాటు..కుక్కకు ఇప్పటి వరకూ వేసిన స్టెరిలైజేషన్ నుంచి ఆ కుక్క పొందిన అన్ని వైద్య వివరాలు కూడా ఆ స్కానర్‌లోనే ఉండేలా ఆ ఐడీని తయారు చేశారు.
వీధికుక్కల గురించి ఈ కార్యక్రమాన్ని ‘pawfriend.in’ అనే సంస్థ ప్రారంభించిందట. దీనికి సూత్రధారిగా మారిన అక్షయ్ రిడ్లాన్ అనే ఇంజనీర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. కుక్కల కోసం తయారు చేసిన గుర్తింపు కార్డు ప్రయోజనాన్ని వివరిస్తున్న సంస్థ.. ఇది కుక్కల కోసమే కాదు.. ఏదైనా ఇంట్లో పెంచుకున్న జంతువు ఎక్కడైనా తప్పిపోయి మనకు కనిపించినా కూడా..దానిని క్యూఆర్ కోడ్ సాయంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చునని దాని ద్వారా యజమానులకు తిరిగి అందించవచ్చని చెబుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE