ట్యాక్స్ రిటర్న్‌లను త్వరగా ఫైల్‌ చేసుకోండి..

IT Returns Filing For Financial Year 2022-23 Last Date is July 31,IT Returns Filing For Financial Year,Financial Year 2022-23,IT Returns Last Date is July 31,IT Returns Last Date,Mango News,Mango News Telugu,IT Returns Financial Year 2022-23,Income Tax Return, ITR, ITR FILING, CENTRAL GOVERNMENT,ITR filing deadline for the Financial Year,e-filing income tax return,ITR Filing Last Date,No Plan To Extend Deadline,ITR Filing Due Dates,IT Returns Filing Latest News,IT Returns Filing Latest Updates,IT Returns Last Date Latest News,IT Returns Last Date Latest Updates

ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిటర్న్‌లను దాఖలు చేయడానికి జులై 31 డెడ్‌లైన్ అని, ఈ తేదీని పొడిగించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రెవెన్యూ సెక్రటరీ సంజయ్‌ మల్హోత్రా చెప్పారు. అందుకే ట్యాక్స్‌ పేయర్లంతా ఐటీఆర్‌ ఫైలింగ్ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఐటీఆర్‌ ఫైలింగ్‌ ఎక్కువగా ఉంటుందని తాము అంచనావేస్తున్నట్లు సంజయ్ చెప్పారు. గత ఏడాది జులై 31 నాటికి రూ. 5.83 కోట్ల వరకూ ఐటీఆర్‌ ఫైలింగ్స్ జరిగాయని గుర్తు చేశారు. అలాగే 2022-23 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు కూడా ఈ ఏడాది జులై 31 ఆఖరి తేదీ అని మరోసారి చెప్పారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్‌ ఫైలింగ్స్‌.. చాలా వేగంగా జరగుతున్నాయి కాబట్టి.. లాస్ట్ డేట్ వరకు వేచి ఉండొద్దని ట్యాక్స్‌ పేయర్లకు ఆయన సలహా ఇచ్చారు.

ట్యాక్స్ కలెక్షన్స్ ను తాము టార్గెట్‌ పెట్టుకున్నామని తప్పకుండా ఆ గ్రోత్‌ను సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. తాము 10.5 శాతం గ్రోత్ రేట్ సాధించడం కోసం టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. జీఎస్‌టీ కలెక్షన్స్ గ్రోత్‌ రేట్ ఇప్పటి వరకూ పన్నెండు శాతంగా ఉందని వివరించారు. ఎక్సైజ్ డ్యూటీ విభాగంలో కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశం ఉందని, దీనికి కారణం రేట్లను తగ్గించడమేనని మల్హోత్రా పేర్కొన్నారు. ప్రజెంట్ ఎక్సైజ్ డ్యూటీ డిపార్టుమెంట్‌లో నెగెటివ్ గ్రోత్ నమోదయ్యిందని, ముందుకెళ్లే కొద్దీ పరిస్థితుల్లో.. మార్పు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్యాక్స్ రేట్ల తగ్గింపు ఎఫెక్ట్ అనేది పోతే.. ఎక్సైజ్‌ డ్యూటీ కలెక్షన్‌ పెరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని సంజయ్ చెప్పారు. అయితే, 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే.. ట్యాక్స్ కలెక్షన్‌ రూ.33.61 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అలాగే గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.30.43 లక్షల కోట్లు వచ్చాయి. ఇప్పుడు.. కార్పొరేట్ మరియు ఇండివిడ్యువల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.18.23 లక్షల కోట్ల సేకరణను టార్గెట్‌గా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.5 శాతం ఎక్కువే ఉంది. అంతేకాదు.. కస్టమ్స్ డ్యూటీ ద్వారా వచ్చే రెవెన్యూ.. 11 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు పెరగొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముందుగా ఈ టార్గెట్‌‌ను రూ.2.10 లక్షల కోట్లుగా అంచనా వేసిన అధికారులు.. తర్వాత దీనిని సవరించారు. ప్రస్తుత ఫైనాన్సియల్ ఇయర్లో జీఎస్‌టీ వసూళ్లు పన్నెండు శాతం పెరిగి.. రూ.9.56 లక్షల కోట్లు వస్తాయని అంతా అంచనా వేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే.. డైరెక్ట్‌, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కలుపుకొని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33.61 లక్షల కోట్లు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 18 =