జపాన్‌ ఆఫీస్‌లలో రాత్రి షిప్టులు ఉండవు.. రీజన్ అదేనట

Japanese Company Bans Late-Night Work at Office To Led To A Spike in Birth Rate,Japanese Company Bans Late Night Work,Japanese To Led To A Spike in Birth Rate,Late Night Work at Office,Bans Late Night Work at Office,Mango News,Mango News Telugu,Japanese firm bans late night work,Falling Fertility Rates,Japan, Abolition of night shifts in Japan, night shifts in Japan,Prohibition to work after 8 o clock,The Mystery of Why Japanese People,China Financial Crisis,Japanese Night Work Latest News,Japanese Company Latest News,Japanese Company Latest Updates

జపాన్ లో నైట్ షిఫ్ట్ లపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాత్రి ఎనిమిది తర్వాత అస్సలు వర్క్ చేయడానికి వీలులేదని తేల్చి చెప్పేసింది. అందుకు కారణం బర్త్ రేటు తగ్గిపోవడమే అని సమాచారం. రాత్రి 8 గంట‌ల త‌ర్వాత ప‌ని చేయ‌డంపై జపాన్‌కు చెందిన ఇటోచు కార్పొరేష‌న్ నిషేధం విధించిన ప‌దేళ్ల తర్వాత కంపెనీలో మ‌హిళా ఉద్యోగుల సంతాన సాఫ‌ల్య రేటు రెండింత‌లైంది. కంపెనీలో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల‌కు 2022 నాటికి ఇద్ద‌రు పిల్ల‌ల చొప్పున ఫెర్టిలిటీ రేటు పెరిగింద‌ని గుర్తించారు. తమ దేశ జనాభాని పెంచుకోవడానికి ఈ విధానం బాగా పనికొస్తుందని భావిస్తోంది జపాన్ ప్రభుత్వం. అందుకే ఈ నివేదికను పరిశీలించిన జపాన్ ప్రభుత్వం.. అన్ని ఆఫీస్ లలో ఇదే విధానాన్ని అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.

ఇకపోతే.. జపాన్ లో సంతాన రేటు 1.3 శాతాన్ని ఇటోచు కార్పొరేషన్ కంపెనీ ఉద్యోగినులు అధిగ‌మించారు. ఇటీవ‌ల ఉద్యోగుల‌కు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు ఇటోచు అనుమ‌తించ‌డంతోపాటు.. కార్యాల‌యం ప‌ని గంట‌ల‌ను ఎనిమిది నుంచి ఆరు గంట‌ల‌కు కుదించింది. 2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈవోగా మ‌షిహిరో ఒక‌ఫుజి నియమితులు అయ్యాక.. రాత్రి ఎనిమిది దాటితే అస్సలు ఆఫీస్ లో ఉండటానికి వీలు లేదని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీంతో 8 గంటల తర్వాత ఉద్యోగుల అంతా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లేవారు. అనుకోని పరిస్థితులు మిన‌హా నైట్ ఓవ‌ర్‌టైమ్‌ను కూడా ర‌ద్దు చేశారు.

ఇక ఈ ప‌దేళ్లలో ఫ్యామిలీమార్ట్ నుంచి మెట‌ల్స్ ట్రేడింగ్ వ‌ర‌కూ ఇటోచు లాభాలు ఏకంగా ఐదింత‌లు పెరిగాయి. 2010 నుంచి 2021 వ‌ర‌కూ ఇబ్బ‌డిముబ్బ‌డిగా కంపెనీ లాభాల‌ను ఆర్జించింది. ఈ క్ర‌మంలో ప‌లువురు మ‌హిళా ఉద్యోగులు మెట‌ర్నిటీ లీవులు తీసుకుని పిల్ల‌ల‌ను క‌ని తిరిగి ప‌నిచేసేందుకు వ‌చ్చారు. తాము ఉత్పాద‌క‌త పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యం బ‌ర్త్ రేట్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని తామ‌నుకోలేద‌ని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబ‌య‌షి చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఇది ఆనందంగా ఉందని కూడా చెబుతున్నారు.. త్వరలోనే ఇలాంటి నిబంధనలను పలు దేశాలు అమలు చెయ్యనున్నట్లు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 9 =