భారత బాల మేధావి, భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరోసారి అద్భుతం చేశాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్, నార్వే ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను వరుసగా రెండోసారి ఓడించి 16 ఏళ్ల ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న చెస్బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఐదవ రౌండ్‌లో ప్రజ్ఞానంద శుక్రవారం ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. చెస్బుల్ మాస్టర్స్ అనేది 16 మంది ఆటగాళ్ల మధ్య నిర్వహించే ఆన్‌లైన్ రాపిడ్ చెస్ పోటీ. మూడు నెలల వ్యవధిలో ప్రజ్ఞానానంద నార్వేజియన్‌ను ఓడించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
దీనికి ముందు ప్రజ్ఞానంద జనవరిలో నిర్వహించిన ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అయిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ యొక్క ఎనిమిదో రౌండ్‌లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు. కార్ల్‌సెన్ మరియు ప్రజ్ఞానానంద మధ్య పోటీ డ్రాగా సాగింది, అయితే కార్ల్‌సెన్ తన 40వ ఎత్తుగడలో పెద్ద పొరపాటు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో కార్ల్‌సెన్ 15 స్కోరుతో మూడో స్థానంలో ఉండగా, ప్రజ్ఞానానంద 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద తన ఆట ద్వారా ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీలలో సంచలనం సృష్టించాడు. మరోవైపు చైనాకు చెందిన వీ యి 18 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, డేవిడ్ ఆంటోన్ 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF