రోజురోజుకు భారీగా తగ్గిపోతున్న ‘చాట్‌జీపీటీ’ యూజర్లు

ChatGPT Users Are Decreasing Day by Day,ChatGPT Decreasing Day by Day,ChatGPT Users,ChatGPT Users Are Decreasing,chatgpt,Mango News,Mango News Telugu,UBS Research report, many problems with tools,100 million users, users,ChatGPT sees first drop in user numbers,ChatGPT faces traffic decline,ChatGPT Sees Decline in Users,ChatGPT Drops About 10% in Traffic,ChatGPT sees its first monthly drop,ChatGPT Users Latest News,ChatGPT Users Latest Updates,ChatGPT Users Live News,ChatGPT Latest News and Updates

పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత అన్నిటికి వర్తించకపోయినా కొన్ని సందర్భాలలో మాత్రం తప్పకుండా వర్తిస్తుంది. రీసెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ చాట్‌జీపీటీ (ChatGPT).. ఇప్పుడు చతికిల పడుతోంది. 2022 నవంబర్‌లో మార్కెట్‌లో విడుదలైన చాట్‌జీపీటీ యాప్.. రానురాను ఆ వినియోగించేవారి సంఖ్య తగ్గిపోతున్నట్లు వాషింగ్టన్ (Washington Report) చెబుతోంది. దీనికి కారణం వినియోగుదారులు ఈ మధ్య కృత్తిమ మేధ టూల్స్, ఇమేజ్ జనరేటర్స్ టూల్స్ వాడటాన్ని పెద్దగా ఇష్టపడకపోవడమేనని చెబుతోంది.

నిజానికి టెక్నాలజీ యుగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్ చాట్ బోట్.. ఏ మాత్రం అంచనాలు లేకుండా గతేడాది నవంబర్లో వచ్చి ఏకంగా సునామీనే సృష్టించింది. ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా రికార్డుల మోత మోగించింది. అప్పటి వరకూ కాలర్ ఎగరేసుకుని తిరిగిన గూగుల్ వంటి దిగ్గజ సంస్థకు గట్టి షాక్ ఇస్తూ కేవలం రెండు నెలల్లోనే 100 మిలియన్ల యూజర్ల (100 million users)ను సొంతం చేసుకుంది. ఒక్క జనవరి నెలలోనే రోజుకు 13 మిలియన్ల మంది దీనిని వినియోగించేలా చేసింది. ఇదే వేరే యాప్‌లు అయితే కనీసం రెండేళ్లయినా ఈ టార్గెట్‌ను రీచవడానికి పట్టేదని యూబీఎస్‌ రీసెర్చ్‌ నివేదిక (UBS Research report) చెబుతోంది.

కానీ రానురాను చాట్‌జీపీటిని వినియోగించేవారి సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతూ వస్తోంది. మే నుంచి జూన్ నెలలో చాట్ జీపీటీ యూజర్లు 9.7శాతం పడిపోయారని.. అప్పుడప్పుడు వాడే యూనిక్ విజిటర్స్ కూడా 5.7శాతం తగ్గారని యూబీఎస్‌ రీసెర్చ్‌ చెబుతోంది. అమెరికాలో ఏఐ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ 10.3శాతం మంది యూజర్లు అసలు ఏఐ యాప్ సంగతే మర్చిపోయారు. యూనిక్ విజిటర్స్ కూడా 8.5 శాతానికి తగ్గినట్లు నివేదిక చెబుతోంది. నవంబర్‌ నుంచి జనవరి వరకూ బాగా పెరిగిపోయిన యూజర్లు ఫిబ్రవరి నుంచి తగ్గడం మొదలుపెట్టారు . ఫిబ్రవరి మార్చి నెలలో 10 బిలియన్ల నుంచి 15 ఈ సంఖ్య చేరింది. ఏప్రిల్ నుంచి మే అయితే మరీ ఘోరంగా గ్రోత్ రేట్ తగ్గిపోయినట్లు నివేదిక చెబుతోంది.

చాట్ జీపీటీ మంత్లీ యూజర్లు 20 బిలయన్లు పెరుగుతారని ప్రారంభంలో వేసిన అంచనా ఇప్పుడు మొత్తంగా రివర్స్ అయింది. వాడినవాళ్లు కూడా ఏదో యాప్ ఎలా పనిచేస్తుందని టెస్ట్ కోసం వాడిన వాళ్లు తప్ప యూజర్లు యాప్ లో గడిపి సమయం కూడా 6 నుంచి 8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే ఇంత సడన్‌గా ఏఐ నుంచి యూజర్స్ తగ్గడానికి కారణం వాటిపై నమ్మకం కోల్పోడమేనని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ టూల్స్ లో చాలా సమస్యలు (Too many problems with tools) ఎదురయ్యాయి.

గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ తో పాటు ఏ ఇతర ఏఐ టూల్స్ తయారీ సంస్థల గురించి యూజర్లు తమ సమస్యను అడిగితే తప్పుడు సమాచారం అందించి అదే సరైందని ఏఐ నమ్మిస్తుందని యూజర్లు అర్ధం చేసుకున్నారు . కోడింగ్ తయారు చేసే సమయంలో ఇలాంటి సమస్యను ఎక్కువగా ఫేస్ చేసారు. అలాగే సున్నిసితమైన కంపెనీ డేటాను చాట్ జీపీటీతో పంచుకోవడం వల్ల సీక్రెట్స్ బయటపడతాయేమోనని కంపెనీలు భయపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే యూజర్లు కనుమరుగైపోవడం గ్యారంటీ అని యూబీఎస్‌ రీసెర్చ్‌ చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 3 =