ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ మరియు సర్వోదయ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రులు కేసీఆర్‌ మరియు అరవింద్‌ కేజ్రీవాల్‌

Telangana Chief Minister KCR Visits Sarvodaya School Along with Delhi CM Kejriwal, Chief Minister KCR Visits Sarvodaya School Along with Delhi CM Kejriwal, KCR Visits Sarvodaya School Along with Delhi CM Kejriwal, Telangana Chief Minister Visits Sarvodaya School Along with Delhi CM Kejriwal, Telangana Chief Minister KCR Visits Sarvodaya School, Delhi CM Kejriwal, Nationwide Tour of CM KCR, Telangana CM KCR to Start Country Wide Tour, CM KCR to Country Wide Tour, CM KCR to Country Wide Tour News, CM KCR to Country Wide Tour Latest News, CM KCR to Country Wide Tour Latest Updates, CM KCR to Country Wide Tour Live Updates, KCR on nation-wide tour from today, Telangana CM KCR To Begin Nationwide Tour, CM KCR, KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి నగరంలోని సర్వోదయ పాఠశాలను మరియు ప్రముఖ మొహల్లా క్లినిక్స్ ను సందర్శించారు. మొదటగా సీఎం కేసీఆర్ దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. ఇక్కడ సీఎం కేసీఆర్‌ బృందానికి ఢిల్లీ డెప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోడియా సాదర స్వాగతం పలికారు. పాఠశాల లోని సర్వోదయ పాఠశాల డాక్యుమెంటరీని వీక్షించారు. పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. విద్యావిధానంలో ఢిల్లీ సర్కార్‌ తీసుకొచ్చిన మార్పులు, డిజిటల్ విధానం, నూతన సంస్కరణలను కేసీఆర్‌ పరిశీలించారు.

అనంతరం అరవింద్ కేజ్రీవాల్‌ తో కలిసి మొహల్లా క్లినిక్స్ ను సందర్శించారు. మొహల్లా క్లినిక్ అనేది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం అక్కడ సాధారణ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి స్థాపించిన కమ్యూనిటీ క్లినిక్. ప్రస్తుతం, రాజధాని నగరం ఢిల్లీ అంతటా 300 కంటే ఎక్కువ మొహల్లా క్లినిక్‌లను కలిగి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రతిరోజూ వందలాది మంది సామాన్యులకు అవసరమైన మందులు మరియు పరీక్షలను అందిస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో మరి కొద్దిరోజుల్లో రాజకీయంగా సంచలనం చోటుచేసుకోనుందని తెలిపారు. కొత్త విద్యావిధానంపై రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించలేదని, కేంద్రం కొత్త విద్యావిధానం తెచ్చిందని విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =