టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ డేటా సిగ్నల్స్ ను కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం మంగళవారం నాడు ప్రారంభం అయింది. దీనిలో భాగంగా 4.3 లక్షల కోట్ల ఖరీదైన 72 గిటాహెట్జ్‌ల రేడియో తరంగాలను వేలం వేయనున్నారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు గౌతమ్ అదానీ యొక్క ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూనిట్ 5G స్పెక్ట్రమ్ కోసం వేలం రేసులో ముందున్నాయి. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 GHz (గిగాహెర్ట్జ్) 5జీ ఎయిర్‌వేవ్‌ల ఆఫర్‌తో వేలం ప్రారంభమైంది.
కాగా ఇది అల్ట్రా-హై స్పీడ్, 4జీ తో పోలిస్తే సుమారు 10 రెట్లు వేగంతో డేటాను అందిస్తుంది. దీంతో లాగ్-ఫ్రీ కనెక్టివిటీ, మరియు రియల్ టైం డేటాను పంచుకోవడానికి బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేయబడిన పరికరాలను ఒకేసారి ప్రారంభించవచ్చు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేలం ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. దీని ద్వారా టెలికాం డిపార్ట్‌మెంట్ వేలం రూ. 70,000 కోట్ల నుండి రూ. 1 లక్ష కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. దిగ్గజ కంపెనీలు రంగంలో ఉండటంతో దీనిని ఎవరు గెలుచుకుంటారనే ఉత్సుకత 5G స్పెక్ట్రమ్ వేలంపై ఉంది.
వేలం లోని కీలక అంశాలు..
- టెలికాం డిపార్ట్‌మెంట్ వేలం నుండి రూ. 70,000 కోట్ల నుండి రూ. 1 లక్ష కోట్ల వరకు ఆశిస్తోంది. వేలం రోజుల సంఖ్య రేడియో తరంగాల వాస్తవ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
- వివిధ తక్కువ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz) మరియు అధిక (26 GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ కోసం వేలం నిర్వహించబడుతుంది.
- ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.14,000 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చేయగా, ప్రత్యర్థి అదానీ గ్రూప్ ఇటీవలే రూ.100 కోట్ల డిపాజిట్ చేసింది.
- ఇక ఈసారి 5G రేడియో తరంగాలను కోరుతున్న నలుగురు దరఖాస్తుదారుల ఈఎండీ రూ.21,800 కోట్లకు చేరింది. కాగా ఇది 2021 వేలంలో మూడు కంపెనీలు రేసులో ఉన్నప్పుడు జమ చేసిన రూ.13,475 కోట్ల కంటే గణనీయంగా ఎక్కువ.
- గౌతమ్ అదానీ గ్రూప్ విమానాశ్రయాల నుండి పవర్ మరియు డేటా సెంటర్‌ల వరకు తన వ్యాపారాలకు ఉపయోగపడేలా ప్రైవేట్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి దీనిని వినియోగించుకోనుంది.
- అనేక సంవత్సరాలుగా 5G నెట్‌వర్క్‌లను కలిగి ఉన్న దక్షిణ కొరియా మరియు చైనా వంటి ఇతర దేశాల సరసన చేరడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా.. ఎటువంటి ముందస్తు చెల్లింపు లేకుండా 20 సమాన వాయిదాలలో చెల్లించడానికి భారతదేశం సంస్థలను అనుమతించింది.
- ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్‌ల జాబితాలో భాగంగా జూలై 18న టెలికాం డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, స్పెక్ట్రమ్ కోసం పోటీలో ఉన్న వారిలో అత్యధికంగా రిలయన్స్ జియో రూ. 14,000 కోట్ల ఈఎండీని సమర్పించింది.
- కాగా వేలంలో స్పెక్ట్రమ్ ను దక్కించుకున్న కంపెనీ 20 సంవత్సరాల పాటు దానిని వినియోగించుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాతే స్పెక్ట్రమ్ ను సరెండర్ చేసుకునే వీలుంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ