భారత క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. దేశీయంగా ఉన్న ఎంతోమంది యువ ఆటగాళ్లకు వేదికగా నిలిచింది ఐపీఎల్. అయితే, ఐపీఎల్ లో ఈ ఏడాది కొత్తగా అరంగేట్రం చేయనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తాజాగా తమ జట్టుకు ‘గుజరాత్ టైటాన్స్’ పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది.. కాగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని బ్రిటన్ కు చెందిన సీవీసీ క్యాపిటల్ సొంతం చేసుకోవడం తెలిసిందే. దీనికోసం సీవీసీ క్యాపిటల్ రూ.5,625 కోట్లతో బిడ్ వేసింది.
‘ఈ జట్టు గుజరాత్ కోసం ఎన్నో విజయాలను అందుకుని పైకి ఎదగాలన్నది మా ఆకాంక్ష. మా జట్టుకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే టైటాన్స్ పేరు సరైనదే అని భావించాం’ అని సీవీసీ భాగస్వామి సిద్ధార్థ పటేల్ తెలిపారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ను నియమించిన సంగతి తెలిసిందే. అలాగే రషీద్ ఖాన్, శుభమ్ గిల్ ను జట్టు వేలానికి ముందే ఎంపిక చేసుకుంది. మరో కొత్త ఫ్రాంచైజీ లక్నోను ఆర్పీఎస్జీ గ్రూపు సొంతం చేసుకుంది. దీనికి ‘లక్నో సూపర్ జెయింట్స్’ అని పేరు పెట్టింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ