అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠను రేపుతున్నాయి. బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పుడు ట్రంప్ కి క్లియర్ ఎడ్జ్ కనిపించింది. ఒకానొక దశలో ట్రంప్ గెలవడం నల్లేరు మీద నడకే అన్న సంకేతాలు కూడా వచ్చాయి. దీనికి కారణం డిబేట్ ల ట్రంప్ బైడెన్ పై పైచేయి సాధించడం.. బైడెన్ వయసు, పలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ రకంగా చూసినా ట్రంప్ కు పోటీ ఇవ్వలేకపోయాడు బైడెన్. మరో వైపు బైడెన్ కు సొంత పార్టీలో నే అసమ్మతి సెగలు గట్టిగా తాకాయి. ఇవన్నీ ట్రంప్ కు అనుకూలంగా మారాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ట్రంప్ పై హత్యయత్నం మరో ఎత్తు… వెరసి ట్రంప్ కు ఒకానొక దశలో ట్రెండ్స్ ప్రకారం 6 శాతం లీడ్ వచ్చింది. అయితే ట్రంప్ దూకుడు ముందు జో బైడెన్ తేలిపోతుండటంతో మరింత అప్రమత్తమయిన డెమోక్రటిక్ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. జో బైడెన్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేలా ఒత్తిడి తీసుకువచ్చింది.. బైడెన్ కూడా సరైన సమయంలో తన అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
జో బైడెన్ తప్పుకోవడంతో అధ్యక్ష పదవి పోటీలో కి కమలా హరీస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా డెమొక్రటిక్ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. వాల్ స్ట్రీట్ జనరల్ పోల్ ప్రకారం ట్రంప్ కు 49 శాతం, కమల హరీష్ 47 శాతం మొగ్గుచూపారు. ఒక్క నెలలోనే ట్రంప్ ఆధిక్యం 6 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది. సెఫాలజీ లెక్కల ప్రకారం ఏ పోల్ లో అయిన 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండవచ్చు. రెండు శాతం ఆధిక్యాన్ని పెద్దగా పరిగణించరు. ఈ రెండు శాతం లీడ్ మరింత పెరగవచ్చు లేదా ఈ రెండు శాతం లీడ్ కాస్త తగ్గిపోయి కమలా హరీస్ కు పెరిగే అవకాశం లేకపోలేదు. మార్జిన్ కన్న మెజార్టీ తక్కువ ఉంది కనుక ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు అని చెప్పలేని పరిస్థితి.
కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరికి మాత్రమే పోల్ నిర్వహిస్తే ట్రంప్ రెండు శాతం అధ్యిక్యత సాధించగా ఇతర క్యాడిటెట్లను కూడా కలుపుకుని పోల్ నిర్వహిస్తే అనుహ్యంగా కమలా హరీస్ కు లీడ్ వచ్చింది. 45 శాతం కమలా హరీస్ కు రాగా 44 శాతం ట్రంప్ కు శాతం వచ్చింది. అయితే కమలా హరీస్ ట్రంప్ పై లీడ్ సాధించింది అని ఇప్పుడే చెప్పలేం కాని రానున్న రోజుల్లో పరిణామాలు కమలా హారీస్ కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు పరిస్థితులను అవగతం చేసుకుని దూకుడును ప్రదర్శిస్తారో వారినే విజయం వరించే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE