కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 9,066 కరోనా కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,00,405 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 50,053 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 2,064 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,05,210 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 44,441 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులంలో జిల్లాలో అత్యధికంగా 8713 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 8184, కోజికోడ్ లో 5155, త్రిస్సుర్ లో 4662, కొట్టాయంలో 3987, మలప్పురంలో 2384 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 4,21,38,043 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ